మదురైలో ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ప్రేమికుడు
రిపోర్టర్: సునీల్
స్థలం: మదురై, తమిళనాడు
తమిళనాడులోని మదురైలో దారుణం జరిగింది. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రియురాలు మాట్లాడటం లేదని ఆగ్రహించిన నాగార్జున అనే యువకుడు, మద్యం మత్తులో ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడు. అది గోడకు తగిలి వెనక్కి వచ్చి అతడిపైనే పేలడంతో భయపడి పారిపోయాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.