'దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళి': హైదరాబాద్‌లో విమోచన దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెర్మనీ నిర్వహించి దేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అనంతరం, కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని వీరు స్వీకరించగా, బలగాలు నిర్వహించిన కవాతు ఎంతో ఆకట్టుకుంది.