వాడరేవు తీరంలో విషాదం: సముద్రంలో గల్లంతైన ఐదుగురు మత్స్యకారులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో మురసు తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు అలల ఉద్ధృతికి గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో ఎర్రిపల్లి రమణ, కోదండ, సూరాని పోల్ రాజ్, జగ్గారావు, అప్పారావు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు యంత్రాగం వెల్లడించింది.