జైలు నుంచి ఖైదీల పరారీ కలకలం: ఐదుగురు అదుపులో

రిపోర్టర్: గోపి స్థలం: Theni

తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా తేక్కంపట్టి ఉప జైలు నుంచి పదిహేడు మంది ఖైదీలు పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి ఇప్పటివరకు ఐదుగురు ఖైదీలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా పన్నెండు మంది పరారీ నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు ముమ్మరం చేశాయని అధికారులు పేర్కొన్నారు.