ముంబైలో నటుడు ఇమ్రాన్ ఖాన్కు షాక్: భారత్ వీడాలని ఆదేశం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ముంబై

అమెరికా పౌరసత్వం కలిగి ఉండి రాజకీయ నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఓసీఐ కార్డ్ హోల్డర్గా భారత్లో ఉంటున్న ఆయన నిబంధనలు ఉల్లంఘించారంటూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఫిర్యాదు చేశారు. ఇమ్మిగ్రేషన్ చట్టం కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు, అక్టోబర్ 28 లోగా ఆయన దేశం వీడాలని స్పష్టం చేశారు.