ఉత్తరప్రదేశ్‌లో దారుణం నిద్రపోతున్న తాతను పారతో నరికి చంపిన మనుమడు
రిపోర్టర్: సునీల్
స్థలం: Uttar Pradesh
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలీ పరిధిలోని డాల్‌మౌ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పురే భవానీ గ్రామంలో నిద్రపోతున్న 91 ఏళ్ల వృద్ధుడు పరమేశ్వర్ యాదవ్‌పై ఆయన 27 ఏళ్ల మనుమడు రూపేష్ అలియాస్ శర్వన్ పారతో దాడి చేశాడు. కుటుంబంలో తాత ఆధిపత్యంపై కక్ష పెంచుకున్న నిందితుడు నిద్రలో ఉన్న సమయంలో ఈ అరాచకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన పరమేశ్వర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.