భూసేకరణ నిధులను వెంటనే రైతులకు అందించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం కోసం విడుదల చేసిన రూ.813 కోట్లను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే రైతులకు అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. నిధులు ఖాతాల్లో నిరుపయోగంగా ఉండటం సరికాదని, అర్హులైన రైతులందరికీ పరిహారం అందేలా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు.