రవాణాపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రశాంతంగా ఎస్ఎంసీ ఎన్నికలు
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలంలోని రవాణాపల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిణి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. ఈ ప్రక్రియలో కిత్తలోవ గ్రామానికి చెందిన కూడా రమణమ్మ పాఠశాల చైర్మన్గా, కూడా కనకమహాలక్ష్మి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.