మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీపై తెలుగు దేశం పార్టీ ఆగ్రహం
రిపోర్టర్: గోపి
స్థలం: Andhra Pradesh
ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేని వైఎస్సార్సీపీ నేతలు, చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని Telugu Desam Party (TDP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కష్టపడి చదివిన నిజమైన ప్రతిభావంతులైన అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కాయని, అర్హులైన నిరుద్యోగులను మోసం చేసేలా ప్రతిపక్ష పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ మండిపడింది. అర్హత సాధించిన ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.