నీట్ పీజీ ప్రవేశాలపై కీలక సిఫార్సు: పర్సంటైల్ విధానం రద్దుకు నిపుణుల కమిటీ ప్రతిపాదన

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

నీట్ పీజీ మరియు ఎస్ఎస్ ప్రవేశాల ప్రక్రియను సమీక్షించేందుకు నియమించిన నిపుణుల కమిటీ ప్రస్తుత పర్సంటైల్ విధానాన్ని రద్దు చేసి ర్యాంక్ ఆధారిత మెరిట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టుకు నివేదించింది. నేషనల్ మెడికల్ కమిషన్ ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, 2027 నుంచి దీనిని అమలు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖాళీ సీట్ల భర్తీ కోసం కటాఫ్ మార్కులను ఇకపై తగ్గించకూడదని ఆ కమిటీ స్పష్టం చేసింది.