ముంబైలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కలకలం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Mumbai
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా ముంబైలోని జుహు ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని ముంబై పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయన వాహనంపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ తో పాటు మరో ఆటో డ్రైవర్ గాయపడగా, టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డారని స్పష్టం చేశారు. ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వెలువడటంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.