సైబర్ మోసాలపై విశాఖ పోలీసుల హెచ్చరిక: వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలని విజ్ఞప్తి

రిపోర్టర్: సతీష్ స్థలం: విశాఖపట్నం

పబ్లిక్ ప్లాట్ఫారమ్లలో ఎవరూ కూడా తమ లొకేషన్ మరియు వ్యక్తిగత వివరాలను ఇతరులతో షేర్ చేయవద్దని విశాఖ నగర పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వాడేటప్పుడు ప్రైవసీ సెట్టింగ్స్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోకుండా ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని VizagCityPolice (@vizagcitypolice) హెచ్చరించారు. ఆన్లైన్ మోసాలపై ఏటా అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, పౌరులు అప్రమత్తంగా ఉండి తమ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా కాపాడుకోవాలని వారు కోరారు.