జర్మనీలో టెస్లా కారుకు వింత జరిమానా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: జర్మనీ
జర్మనీలోని కొన్స్టాంజ్ నగరంలో తన టెస్లా కారును ఎలక్ట్రిక్ వెహికల్ పార్కింగ్ స్థలంలో ఛార్జింగ్ పెట్టిన ఒక స్విట్జర్లాండ్ వాసికి అక్కడి అధికారులు యాభై ఐదు యూరోల జరిమానా విధించారు. కారుకు ఛార్జింగ్ కేబుల్ అనుసంధానించినప్పటికీ, ప్రత్యేక ఈవీ లైసెన్స్ లేదా స్టిక్కర్ లేకపోవడంతో అనధికార పార్కింగ్ కింద ఈ జరిమానా విధించినట్లు ఎఐ టూల్ గ్రోక్ ద్వారా తెలుసుకున్నానని బాధితుడు సోషల్ మీడియాలో తెలిపారు.