పీట్ హెగ్ సెత్ పై అభిశంసన తప్పదంటూ డెమొక్రాట్ నేతల సంచలన ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: Washington

అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పీట్ హెగ్ సెత్ పై తాము కచ్చితంగా అభిశంసన చర్యలు తీసుకుంటామని అమెరికా డెమొక్రాట్ ప్రతినిధులు పాట్ రియాన్ మరియు అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ లు సంచలన ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధికార యంత్రాంగాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ వారు ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ లో తగినంత అధికారం లభిస్తే ట్రంప్ సర్కార్ తో భారీ రాజకీయ పోరాటం తప్పదని వారు కుండబద్దలు కొట్టారు.