మైత్రీ మూవీ మేకర్స్ హారర్ థ్రిల్లర్ చిత్రం 418 విడుదల తేదీ ఖరారు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ చిత్రం 418 అని మేకర్స్ తెలిపారు. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 23న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుందని వారు పేర్కొన్నారు. చైత్ర ఆచార్, సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ఈ చిత్రంలో కీలకపాత్రధారులుగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.