స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: అరకులోయ

అరకులోయ నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పీవీటీజీ జనాభా ఆధారంగా స్థానాలు కేటాయించాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా రమేష్ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను కోరారు. మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ మరియు సర్పంచ్ స్థానాల్లో తగిన అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం కృషి చేసిన వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే సానుకూలంగా హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.