'అమెరికా నావికా డ్రోన్‌ను లాక్కోవాలని చూశాయి': అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ బోట్ల ధ్వంసం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: వరల్డ్
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ జలాల్లో అమెరికా నావికా డ్రోన్‌ను అపహరించేందుకు యత్నించిన రెండు ఇరాన్ చిన్న బోట్లను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ సంఘటనపై స్పందించిన సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఇరాన్ తీరును తీవ్రంగా ఖండించగా, అవి ఫిషింగ్ వెస్సెల్స్ మాత్రమేనని ఇరాన్ మీడియా వాదిస్తోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు భారీగా పడిపోయాయి.