విదేశీ గడ్డపై చిక్కుకుని విలవిల్లాడుతున్న నిరుపేద యువకుల ఆక్రోశం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఉపాధి కోసం మలేషియా వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చొక్కర సాయి, లండ తరుణ్ కుమార్, చీకటి సాయివంశీ గత ఆగస్టు 12వ తేదీన విజిటింగ్ వీసాపై మలేషియాకు వెళ్లగా, అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే శిరీష ద్వారా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సమాచారం అందించారు.