హైదరాబాద్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ మాంసం దుకాణాలు బంద్!

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా శుక్రవారం నాడు నగరవ్యాప్తంగా అన్నిరకాల మాంసం, బీఫ్ దుకాణాలు మరియు కబేళాలను పూర్తిగా మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు తీసుకున్న ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు.