ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్: తీసుకోవాల్సిన కూరగాయలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

జీవనశైలి మార్పులు మరియు పోషకాహార లోపం కారణంగా వేగంగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సమస్యను సరైన ఆహారపు అలవాట్లతో నయం చేసుకోవచ్చని గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. కాలేయ ఆరోగ్యానికి పాలకూర, బ్రోకలీ, క్యారెట్, సొరకాయ, కాకరకాయ వంటి కూరగాయలను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం ఎంతో ప్రయోజనకరమని ఆయన స్పష్టం చేశారు.