ఈ నగరానికి ఏమైంది సీక్వెల్: నవంబర్ 19న ఈఎన్ఈ రిపీట్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

యువతరం ఎంతగానో ఇష్టపడిన ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సీక్వెల్గా ఈఎన్ఈ రిపీట్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేయగా, నవంబర్ 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు.