భారీ యాక్షన్ సీక్వెన్స్తో రామ్ పోతినేని రాపో 23 షూటింగ్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: హైదరాబాద్

యువ హీరో రామ్ పోతినేని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రాపో 23 సినిమా రెండో షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా నెట్ ఎఫెక్ట్లో కిలోమీటర్ మేర విస్తరించిన భారీ ప్రాంతంలో అత్యంత వ్యయప్రయాసలతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రబృందం తెరకెక్కించింది. కెవిన్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ సీన్స్ డిజైన్ చేయగా, తిరునావుక్కరసు డీవోపీగా వ్యవహరిస్తున్నారు.