ఈసీ కార్యాలయంపై దాడి చేస్తామంటూ మాజీ మంత్రి దానం నాగేందర్ హెచ్చరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
ఎన్నికల కమిషన్ తీరుపై మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాయత్ నగర్ డివిజన్లో ఓట్ల తొలగింపుపై ఆయన మాట్లాడుతూ, ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరాన్ని తగలబెడతామని హెచ్చరించారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఏకపక్షంగా ఓట్లను తొలగిస్తోందని మండిపడ్డారు. తొలగించిన ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.