ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఫోన్ నంబర్ మార్చుకునే అవకాశం
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్ సదుపాయం కల్పించింది. దరఖాస్తుల్లో తప్పుగా నమోదైన మొబైల్ నంబర్లను సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ పరిధిలోని లబ్ధిదారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఉపయోగించి ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.