హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: హరీశ్ రావు

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడంపై హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, కుంభకోణాలకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి పదవిలో ఉండే నైతిక హక్కు లేదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ తరపున గళమెత్తుతామని, కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.