'నోటీసులకు స్పందించండి': లాహోర్ హైకోర్టు స్పష్టీకరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: పాకిస్థాన్
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్ లకు నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ మహమ్మద్ రిజ్వాన్ దాఖలు చేసిన పిటిషన్ను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఆలియా నీలం, నోటీసులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక ఆధారంగా ఈ ఆటగాళ్లపై తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయమై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయం తీసుకోనుంది.