క్లాస్‌రూమ్ నుంచే సమాజంలో మార్పు సాధ్యమంటూ మంత్రి లోకేశ్ స్పష్టీకరణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: కాకినాడ

క్లాస్‌రూమ్ నుంచే సమాజంలో మార్పు సాధ్యమని, విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు నేర్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాకినాడ జిల్లా రూరల్ తిమ్మాపురంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాంకేతికతకు భారతీయ విలువలు జోడిస్తే ప్రపంచ విజేతలుగా ఎదగవచ్చని, విద్యాశాఖలో రాజకీయాలకు చోటు లేకుండా నో పాలిటిక్స్ ఇన్ స్కూల్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.