మీర్జాపూర్ సినిమా చూస్తూ మధ్యలో నిద్రపోయానని శోభా డే సంచలన విమర్శ!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

మీర్జాపూర్ ది మూవీ చిత్రంపై ప్రముఖ రచయిత్రి శోభా డే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు తాను 15 నిమిషాలు నిద్రపోయినట్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో తెలిపారు. చిత్రంలో కథ లేకపోగా విపరీతమైన హింస ఉందని మండిపడ్డారు. అయితే రవికిషన్, అలీ ఫజల్ నటన బాగుందని ప్రశంసించగా, పంకజ్ త్రిపాఠి నటన మోనోటానస్‌గా మారిందని ఆమె పెదవి విరిచారు.