అమెరికాలో అట్టహాసంగా దీపావళి: నార్త్ డకోటా గవర్నర్ నివాసంలో వేడుకలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నార్త్ డకోటా
అమెరికాలోని నార్త్ డకోటా రాష్ట్ర గవర్నర్ నివాసంలో మొదటిసారిగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బిస్మార్క్ లోని గవర్నర్ భవనంలో జరిగిన ఈ వేడుకల్ లో భారతీయ-అమెరికన్ కుటుంబాలు, సామాజికవేత్తలు, పలువురు నిపుణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గవర్నర్ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్, ప్రథమ మహిళ కెర్స్టి ఆర్మ్‌స్ట్రాంగ్ దీపాలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి భారతీయులు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.