వయోవృద్ధుల హక్కుల చట్టాలపై సుల్తానాబాద్లో అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా ఎస్ఐ చంద్రకుమార్కు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించే పోస్టర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ రాజయ్య, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత, పాఠశాల అధ్యక్షులు సతీష్ పాల్గొన్నారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14567 టోల్ఫ్రీ హెల్ప్లైన్ను సంప్రదించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.