గురుకులంలో అక్రమాల కలకలం: ప్రిన్సిపల్ మోనిక సోని సస్పెన్షన్

రిపోర్టర్: వెంకట్ స్థలం: కరీంనగర్

విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రేకుర్తి మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ మోనిక సోనీని సస్పెండ్ చేసినట్లు టీజీఎంఆర్ఎస్ సెక్రటరీ షఫీయుల్లా బాబా ఉత్తర్వులు జారీచేశారు. హాస్టల్లో ఉండాల్సిన సుమారు ఎనభై మంది విద్యార్థినిలను ఇళ్ల నుంచే డే స్కాలర్లుగా చదివిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిత్రా ఆకస్మిక తనిఖీల్లో గుర్తించారు. ఈ తనిఖీల నివేదిక ఆధారంగా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.