రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోం: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతూ ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయిస్తున్న వారిని వదలొద్దని కలెక్టర్లు, ఎస్పీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పెట్టుబడుల గ్రౌండింగ్ బాధ్యత అధికారులదేనని, వచ్చే సమావేశానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ తో రావాలని తేల్చిచెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ నిలిపివేయొద్దని సీఎం సూచించారు.