విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగంపై ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
కృత్రిమ మేధ వినియోగంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ ప్లాబన్ కుమార్ భౌమిక్ హెచ్చరించారు. విద్యారంగంలో కృత్రిమ మేధను కేవలం సమాధానాలు ఇచ్చే సాధనంగా కాకుండా ఆలోచించే శక్తిని పెంచేందుకు ఉపయోగించాలని ఆయన సూచించారు. ఏఐ నేరుగా సమస్యలను పరిష్కరిస్తే విద్యార్థులలో మేధోపరమైన అభ్యాసం జరగదని, దీనివల్ల ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏఐ కేవలం సహాయకారిగా ఉండాలి తప్ప వారి బదులు పనులు చేయకూడదని ప్లాబన్ కుమార్ భౌమిక్ పేర్కొన్నారు.