ప్రజల కష్టాలు తీర్చేందుకే జనవాణి కార్యక్రమం
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
జనవాణిలో వచ్చిన వినతుల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తామని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర స్పష్టం చేశారు. నాతవరం జనసేన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి తాగునీరు, పింఛన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి పలు వినతులు అందాయి. ఈ సందర్భంగా వల్సంపేట తాగునీటి సమస్యను, దివ్యాంగుడి పింఛన్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రజలకు, అధికారులకు వారధిగా ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.