జగిత్యాలలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: జగిత్యాల

భారతదేశ ఐక్యతామూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీసులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత, సమగ్రతను పరిరక్షించడంలో ఉక్కు మనిషి అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకున్నారు. జాతి నిర్మాణంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జాతీయ ఐక్యతా దినోత్సవం స్పూర్తిని ప్రతి ఒక్కరూ చాటాలని SP JAGTIAL వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.