పులివెందులలో జగన్ ధర్నా సరికాదంటూ తెదేపా ఇన్ఛార్జి బీటెక్ రవి మండిపాటు

రిపోర్టర్: హరి స్థలం: పులివెందుల

పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద వైకాపా అధినేత జగన్ ధర్నా చేపట్టడం సరికాదని తెదేపా ఇన్ఛార్జి బీటెక్ రవి మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్ లో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు వైకాపా నాయకులు ర్యాలీగా బయలుదేరి ధర్నా చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు వార్డుల్ లో ఓటింగ్ జరగకుండా వైకాపా నేతలు అడ్డుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని బీటెక్ రవి ఆరోపించారు.