రైలు ప్రయాణంలో అస్సాం యువతి మృతి: శ్రీకాకుళంలో మిస్టరీగా మారిన ఘటన
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
అస్సాంకు చెందిన ఇరవై ఏళ్ల కళాశాల విద్యార్థిని హిమశ్రీ బోరో శ్రీకాకుళం సమీపంలో రైలు పట్టాల పక్కన అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం కలకలం రేపింది. విశాఖలో నృత్య ప్రదర్శన ముగించుకుని వివేక్ ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణమైన ఆమె, బోగీలో గుర్తుతెలియని వ్యక్తుల వల్ల భయంగా ఉందని కుటుంబానికి సందేశం పంపింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ కాగా, నాగావళి నది సమీపంలో మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు జారిపడిందా లేక ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.