బ్యాడ్మింటన్ టోర్నీలో దుమ్మురేపిన పీవీ సింధు: ఫైనల్ లోకి దూసుకెళ్లిన స్టార్ షట్లర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్లోకి ప్రవేశించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్ పోరులో తన తోటి క్రీడాకారిణి అన్మోల్ ఖర్బ్ పై కేవలం ముప్ పై రెండు నిమిషాల్లోనే విజయం సాధించి పీవీ సింధు ఈ ఘనత సాధించారు. గత వారంలో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ గా నిలిచిన పీవీ సింధు, ఇప్పుడు మరోసారి తుది పోరుకు సిద్ధమయ్యారు.