మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఐకెపి ఏపీఎం ఆకాంక్ష
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
అగర్బత్తుల తయారీలో శిక్షణ పూర్తి చేసిన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఐకెపి జన్నారం మండల ఏపీఎం లలిత మరియు ఈడీఐఐ ప్రాజెక్ట్ ఆఫీసర్ దేవేందర్ నాయక్ కోరారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం ఆవరణలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు యువతులకు వారు బుధవారం సర్టిఫికెట్లను ఘనంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వరలక్ష్మి, మాస్టర్ ట్రైనర్ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.