తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు: టీడీపీలో చేరిన నంద్యాల నలభై కుటుంబాలు

రిపోర్టర్: శివ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లా సిరివెల్ల పట్టణానికి చెందిన సుమారు నలభై కుటుంబాలు వైయస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో ఇవాళ తన సమక్షంలో వారు పార్టీలోకి వచ్చారని తెలిపారు. కొత్తగా పార్టీలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ సాదరంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.