పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించాలి: ఎమ్మెల్యే వివేకానంద్
రిపోర్టర్: సునీల్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మహబూబ్ నగర్ - హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికులా కష్టపడి పని చేయాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద పిలుపునిచ్చారు. చింతల్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.