షాకింగ్ ఘటన: హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్జే మిట్టే కన్నుమూత

రిపోర్టర్: రమేష్ స్థలం: హాలీవుడ్

బ్రేకింగ్ బ్యాడ్ టెలివిజన్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్జే మిట్టే కన్నుమూశారని ఆయన ప్రతినిధులు తెలిపారు. టెక్సాస్లో సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారని, ఆయన మృతికి గల కారణాలపై లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని పేర్కొన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు, నటుడిగా అందించిన సేవలను ప్రతినిధులు కొనియాడారు.