పంట వ్యర్థాల దహనంపై సీఏక్యూఎం హెచ్చరిక: కిందిస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Punjab
పంజాబ్ లో పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ అధికారులను ఆదేశించింది. సంగ్రూర్, పాటియాలా, మలేర్కోట్ల జిల్లాల్ లో పర్యటించిన ఉన్నత స్థాయి బృందం అధికారులతో సమీక్ష నిర్వహించి, రైతులతో మాట్లాడింది. యంత్రాల వాడకంలో ఎదురవుతున్న ఇబ్బట్లపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వరి గడ్డిని ఇంధనంగా మార్చే పరిశ్రమలను బృందం పరిశీలించి, కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.