ఉద్యోగులకు దసరా కానుకగా మూడు డీఏలు ప్రకటించిన ప్రభుత్వం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మూడు డీఏలు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జరిగిన చర్చల అనంతరం జేఏసీ నేత ఏలూరి శ్రీనివాసరావు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో నేడు జరగాల్సిన విస్తృత స్థాయి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. మార్చి నాటికి పెండింగ్ బిల్లులు పూర్తిగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.