తపాల్పూర్ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య రక్షణకు పోషకాహార పాఠాలు నేర్పిన గురువులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు తిరుపతి తెలిపారు. పెరుగుతున్న వయసులో నాణ్యమైన ఆహారంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.