విజయనగరం ఉత్సవాలు: జొన్నవలసలో పైడితల్లి సిరిమాను వృక్షాలకు వైభవంగా పూజలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో మండలంలోని జొన్నవలసలో సిరిమాను, ఇరుసుమాను వృక్షాలను గుర్తించి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఈవో శిరీష, పూజారి బంటుపల్లి వెంకటరావు వృక్షాలకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టినట్లు తెలిపారు. ఈనెల 26, 27 తేదీల్లో తొలేళ్లు, సిరిమానోత్సవం ఘనంగా జరగనున్నాయని, లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వెల్లడించారు.