రాజాపేటలో అక్రమ ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసిన పోలీసులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను తహశీల్దార్ ఆదేశాలతో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. రేణికుంట గ్రామానికి చెందిన గందమల్లా మహేందర్ తన ట్రాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఎస్సై తఖియుద్దిన్ కేసు నమోదు చేసి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.