మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రికార్డు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన నాటి నుండి మహిళా ప్రయాణికుల స్పందన ఊహించని స్థాయిలో పెరుగుతోందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. రోజుకు సగటున 29.42 లక్షల మంది మహిళలు ప్రయాణించగా, అది 37.09 లక్షలకు చేరిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఏకంగా రూ. 2,428 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు.