షాకింగ్ ఘటన: కన్నతల్లిని హత్య చేసి వంటగదిలో పాతిపెట్టిన నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Puri
ఒడిశాలోని పూరీలో కన్నతల్లిని దారుణంగా హత్య చేసి వంటగది నేల కింద పాతిపెట్టిన పరారీలో ఉన్న నలభై ఏళ్ల నిందితుడిని జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఒడిశా పోలీసులు అరెస్ట్ చేసినట్లు పూరీ ఎస్పీ ప్రతీక్ సింగ్ వెల్లడించారు. సుమారు యాభై ఏడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా పలు రాష్ట్రాల్లో తలదాచుకున్న నిందితుడిని సీసీటీవీ టేజ్లు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.