బొబ్బిలి ఐదో వార్డులో చైర్మన్ అభ్యర్థి తూముల అచ్యుతవల్లి ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ ఐదో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తూముల అచ్యుతవల్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో తనను మరియు పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.